: ఆసియా గ్యాస్ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీలో జరిగిన ఆసియా గ్యాస్ భాగస్వామ్య సదస్సులో ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. భారత్ ఇంధన అవసరాలకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. దీనికితోడు, చమురు సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్ ఆధారిత ధర నిర్ణయించాల్సిన ఆవశ్యకత ఉందని మన్మోహన్ నొక్కి చెప్పారు. 2020 సంవత్సరానికి ఇంధన వినియోగంలో, ప్రపంచంలోనే భారత్ మూడో దేశంగా ఉంటుందని ప్రధాని అన్నారు.