: బ్రహ్మోత్సవాల్లో పల్లకి వాహనంపై విహరించిన పద్మావతి అమ్మవారు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం పల్లకి వాహనంపై పుష్పాలంకార శోభితురాలైన పద్మావతి అమ్మవారు పద్మవాసిని రూపంలో తిరువీధుల్లో విహరించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, కోలాటాలతో పల్లకి సేవ కన్నుల పండువగా సాగింది.