: రాష్ట్ర విభజన తుది నివేదిక రెడీ... నేడు ఆమోదించనున్న జీవోఎం


రాష్ట్ర విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 60 పేజీలతో కూడిన బిల్లు ముసాయిదాను జీవోఎం సిద్ధం చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న చివరి జీవోఎం సమావేశంలో... తుది నివేదికను, ముసాయిదా బిల్లును ఖరారు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రాయల తెలంగాణకే జీవోఎం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలపై గవర్నర్ కే పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వనున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టికల్ 370-డీని కొనసాగించనున్నారు. అంతేకాకుండా, ఇరు రాష్ట్రాల జలవివాదాలను తీర్చడానికి జల మండలి ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజు జరగనున్న జీవోఎం సమావేశాలలో, సీమాంధ్ర రాజధానిపై కూడా కొంత క్లారిటీ రానున్నట్టు సమాచారం. అయితే, కొత్త రాజధానిపై అంతిమ నిర్ణయాన్ని మాత్రం సీమాంధ్రలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికే వదిలేయనున్నారు.

  • Loading...

More Telugu News