: పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ నోట్ల కేసులో నలుగురు నిందితుల అరెస్ట్


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల పరిధిలోని తేతలి గ్రామంలో నకిలీ నోట్ల ముఠా పట్టుబడింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన దొంగ నోట్లు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ ముఠాలో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News