: మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి
మహిళలు, బాలికల రక్షణకు ‘నిర్భయ’ లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాల అమానుష ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం ఆందోళనకర విషయమే. ఇలాంటి అత్యాచార ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నగర మండల పరిధిలోని చినమట్లపూడి గ్రామంలో మూగ బాలికపై ఆర్మీ విశ్రాంత ఉద్యోగి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.