: అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ పరాజయం
అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత జట్టు పరాజయంపాలైంది. ఆరంభ మ్యాచ్ లో భారత్ 3-4తో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. భారత్ తరపున శ్రీజేష్, మన్ దీప్ సింగ్, రూపిందర్ పాల్ గోల్స్ సాధించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ లో దక్షిణ కొరియాతో తలపడనుంది. కాగా, భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ లో 4-3తో న్యూజిలాండ్ పై జయభేరి మోగించింది.