: రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పత్తి రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన మహికో కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి అధికారులతో చర్చిస్తున్నారు.