: విద్యుత్ ఉద్యమం చేపడతాం: యనమల
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై టీడీపీ విద్యుత్ ఉద్యమం చేపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈరోజు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
విద్యుత్ ఉద్యమానికి మద్దతుగా ఈ నెలాఖరు నుంచి సంతకాల సేకరణ ప్రారంభిస్తామని యనమల పేర్కొన్నారు. ఇక అవిశ్వాసం తీర్మానం గురించి చెబుతూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారుపై తుది నిర్ణయం అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆయన స్పష్టం చేశారు.