: సిరియా వైమానిక దాడుల్లో 20 మంది మృతి
సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది చనిపోయారు. అలెప్పొ రాష్ట్రంలోని అల్ బాబ్ నగరంపై హెలీకాప్టర్లతో దాడులు చేశారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్టు సిరియా మానవ హక్కుల వేదిక వెల్లడించింది. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా సైన్యం ఈ దాడులకు పాల్పడింది. తిరుగుబాటుదారులకు, సైనికులకు మధ్య తరచుగా ఘర్షణలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.