: కార్తీక వన భోజనాలతో కళకళలాడిన వనాలు.. భక్తులతో నిండిన శివాలయాలు
కార్తీక మాస సందడితో భాగ్యనగరం కళకళలాడుతోంది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో నగర జనం వనాల బాట పట్టారు. విద్య, వృత్తి వ్యాపకాలతో బిజీగా ఉండే నగర వాసులు కార్తీక వన భోజనాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆనంద ‘రుచు’లను చవి చూశారు. ‘ఆటవిడుపు’ను అందుకుని... ఆదివారాలను ఆస్వాదించి...‘కార్తీక’ మాసానికి వీడ్కోలు పలికారు.
ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రమంతటా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నగరంలో కూడా శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం, కార్తీక మాసం చివరి రోజు రెండూ కలసి రావడంతో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.