: భార్య, సహజీవనచారిణితో సరిసమాన సమయం గడపండి: లోక్ అదాలత్ తీర్పు


భార్య ఉండగానే, మరొక మహిళతో సహజీవనం కొనసాగిస్తున్న వ్యక్తి విషయంలో లోక్ అదాలత్ ఆసక్తికర తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ కు చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు భార్య ఉండగానే, మరో మహిళతో కూడా సహజీవనం కొనసాగిస్తున్నారు. వీరు ముగ్గురూ కూడా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే, తనతో కన్నా సహజీవనం చేస్తున్న మహిళతోనే తన భర్త ఎక్కువ సమయం గడుపుతున్నారంటూ, అతని భార్య లోక్ అదాలత్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన లోక్ అదాలత్ జడ్జి గంగాచరణ్ దుబే... భార్యతోనూ, సహజీవన భాగస్వామితోనూ నెలలో చెరి పదిహేను రోజులు గడపాలని తీర్పునిచ్చారు. అంతే కాకుండా ఇంట్లోని మూడు గదుల్లో... ఇద్దరికీ చెరొక గది కేటాయించాలని, మరొక గదిని ఉమ్మడిగా వాడుకోవాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News