: నిందితులను బహిరంగంగా శిక్షించిన డీఎస్పీ సుప్రజకు అధికారుల షాక్
అనంతపురం జిల్లా గుంతకల్లు డీఎస్పీ సుప్రజకు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఒక హత్య కేసులో నలుగురు నిందితులను నిన్న గుంతకల్లు పట్టణంలో బహిరంగంగా శిక్షించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహించారు. మూడు నెలల పాటు గ్రేహౌండ్స్ శిక్షణకు వెళ్లాలని సుప్రజను ఆదేశించినట్లు తెలిసింది. మల్లయ్య అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను నిన్న పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో బహిరంగంగానే డీఎస్పీ సుప్రజ సహా ఎస్సై, కానిస్టేబుళ్లు వీర ఉతుకుడు ఉతికారు. ప్రజల ముందే శిక్షించారు. ఖాకీలంటే గుండెలు గుభేల్ మనిపించారు. ఇలా అయినా నేరస్థుల్లో భయం కలుగుతుందని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం పోలీసులు రౌడీల్లా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.