: విజయవాడలో బాలికపై నెలరోజులుగా అత్యాచారం
సికింద్రాబాద్ కు చెందిన ఒక బాలిక విజయవాడలో అత్యాచారానికి గురైంది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకున్న బాలికను ఒక యువకుడు కనిపెట్టి తన వెంట తీసుకెళ్లాడు. ఒక ఇంట్లో ఉంచి నెల రోజులుగా అత్యాచారం చేశాడు. అతడితోపాటు మరో నలుగురు కూడా ఆమెపై ఇదే విధంగా దారుణానికి పాల్పడ్డారు. ఎట్టకేలకు వారి చెర నుంచి బయటపడిన బాలిక వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు మాధవ్, సుబ్రహ్మణ్యం, మహేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.