: అడవిలో కానిస్టేబుల్, హోంగార్డు దారుణ హత్య


చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు హత్యకు గురయ్యారు. ఈ ఉదయం అడవికి వెళ్లిన పశువుల కాపరులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దుండగులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళుతున్నారంటూ నిన్న సాయంత్రం ఫోన్ కాల్ వచ్చిందని.. దాంతో హోంగార్డు దేవాను తీసుకుని కానిస్టేబుల్ జవహర్ లాల్ నాయక్ అడవిలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. దుండగులే అడ్డుకోబోయిన కానిస్టేబుల్, హోంగార్డును హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News