: మధ్యాహ్నం 12.40 గంటలకు రాష్ట్రపతితో భేటీ కానున్న చంద్రబాబు


ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 12.40 గంటలకు చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రపతికి బాబు వివరించనున్నారు. దీనికితోడు, న్యాయం చేయాలని కోరుతూ ఆయనకు ఓ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ పర్యటనకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ కీలక నేతలతో కూడిన ఓ బృందం తరలివెళ్లింది.

  • Loading...

More Telugu News