: మూలకణాలతో గుండెకు చికిత్స


మూలకణాలతో పలు అవయవాలకు చికిత్స చేస్తున్నారు. కానీ గుండెకు మూలకణ చికిత్స ఇంతవరకూ చేయలేదు. ఈ చికిత్స చేసి అరుదైన రికార్డును సృష్టించారు భారత సంతతికి చెందిన వైద్యుడు అమిత్‌ పటేల్‌. అమెరికాలో నివసించే అమిత్‌ పటేల్‌ హాలీవుడ్‌ నటుడు ఎర్నీ లైవ్లీ గుండెకు 'రిట్రోగ్రేడ్‌ జీన్‌ థెరపీ' పద్థతిలో మూలకణాలతో చికిత్స చేశారు. ఇలా గుండెకు మూలకణాలతో చికిత్స చేయడం అనేది ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం. 2003లో లైవ్లీ తీవ్ర గుండెపోటుకు గురికావడంతో ఆయన గుండె బాగా దెబ్బతింది. దీంతో ఆయన అమిత్‌ను సంప్రదించగా నవంబరు 7న విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించారు. గుండెకు మూలకణాలతో చికిత్స చేసిన తొలివైద్యుడుగా అమిత్‌ అరుదైన విజయం సొంతం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News