: ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఎక్సైజ్ సీఐ
చిత్తూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఎక్సైజ్ సీఐ ఉన్నతాధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటగిరి ఫారెస్ట్ ఏరియాలో అటవీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనం పట్టుబడింది. వాహనం ఓ అధికారికి చెందినదంటూ వాహనదారులు ఫారెస్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టుబడ్డ వారిలో ఎక్సైజ్ సీఐ సెల్వం కూడా ఉన్నాడు. తమిళనాడు ఎక్సైజ్ శాఖకు చెందిన సెల్వం కనుసన్నల్లోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని అధికారుల విచారణలో తేలింది.