: థర్మల్ ప్రాజెక్టుల నిరసనపై మంత్రి ధర్మాన అసహనం


ఈ మధ్య ర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి అవసరమేంటో సరిగా తెలుసుకోకుండా ఇలా వ్యతిరేకించడం మంచిది కాదన్నారు. పెరుగుతున్న విద్యుత్తు అవసరాల దృష్ట్యా థర్మల్, అణు విద్యుత్ పరిశ్రమలు  ఏర్పాటు చేయవల్సిందేనని ధర్మాన స్పష్టం చేశారు.

ప్రజలందరికీ వ్యవసాయం ఒక్కటే ఉపాధి కాదన్నారు.
 పరిశ్రమల వల్ల కూడా ఎంతోమంది జీవనానికి ఆధారం దొరుకుంతుందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే పరిశ్రమలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ధర్మాన శ్రీకాకుళంలో కోరారు. ప్రజలను మోసం చేసి ప్రైవేటు వ్యక్తులకు భూమిని కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని చెప్పారు. ప్రైవేటు రంగంవల్ల తొందరగా ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News