: ఆర్టీసీ మాజీ సూపరింటెండెంట్ పై సీసీఎస్ కేసు నమోదు
ఆర్టీసీ భవనాల అద్దె సొమ్ము స్వాహా కేసులో ఆర్టీసీ మాజీ సూపరింటెండెంట్ దివాకరరావుపై హైదరాబాదు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ అద్దె సొమ్ము 39 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.