: ఒంగోలు చర్చిలో బాంబు కలకలం


హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిందనడానికి ఇటీవల తరచూ వినిపిస్తున్న'బాంబు కలకలం' వార్తలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టిఫిన్ బాక్సులు, సైకిళ్లు అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు, ప్రజలు వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందిస్తున్నారు.

తాజాగా ఒంగోలులోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక జేఎంబీ చర్చిలో అనుమానాస్పదంగా ఓ సంచి కంటబడింది. దీంతో, అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ ప్రస్తుతం తనిఖీ చేస్తోంది. 

  • Loading...

More Telugu News