: ఆస్తులు కాపాడుకునేందుకే యూటీ ప్రస్తావన: మధుయాష్కి
హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే సీమాంధ్ర నేతలు యూటీ అంటున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేవలం తెలంగాణను అడ్డుకునేందుకే హైదరాబాద్ ను యూటీ చేయాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు.