: తుపాకీ పేలి గాయపడ్డ కానిస్టేబుల్


ఖమ్మం జిల్లా కేంద్రంలోని రఘునాధపాలెం మండలం జింకలతండా వద్ద ప్రమాద వశాత్తు తుపాకీ పేలిన ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఫైరింగ్ ప్రాక్టీసు పూర్తయిన తరువాత కానిస్టేబుల్ భానోతు హనుమ కార్బన్ రైఫిల్ ను శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా తుపాకీ పేలింది. దీంతో కానిస్టేబుల్ తొడ భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News