: క్రాస్ కంట్రీ పోటీల్లో విజేతగా నిలిచిన మహబూబ్ నగర్ జిల్లా
కరీంనగర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు జరిగాయి. జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 550 మంది అథ్లెట్లు హాజరయ్యారు. పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహుమతులను అందించి వారిని అభినందించారు.