: భీమవరంలో రూ. 2 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారిపల్లిలో రెండు లక్షల విలువైన గుట్కా పట్టుబడింది. అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం గుట్కా తయారీ, విక్రయాలపై నిషేధం విధించిన విషయం విదితమే.