: రెండు విమానాశ్రయాల్లో ఫుల్ బాడీ స్కానర్లు
విమానాశ్రయాల నుంచి అక్రమరవాణా పెరిగిపోతుండడంతో జాతీయ విమానాశ్రయాల నిర్వహణ సంస్థ(ఏఏఐ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. రెండు నాన్ మెట్రో ఎయిర్ పోర్టుల్లో ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఏఏఐ ఉంది. మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీతో పని చేసే ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా చేపట్టే ముందు ప్రయాణీకుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఏఏఐ తెలిపింది. ఒక్కో స్కానర్ ధర కోటి ఉంటుందని, ఖరీదైన ఏర్పాటు కావడంతో అన్ని కోణాలలోనూ ఆలోచించి ఆచరణలో పెడతామని ఏఏఐ చెబుతోంది.