: ఘనంగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
భాగ్యనగరంలో చిన్నారుల్లో ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరిసింది... విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. దీనికి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం వేదికగా నిలిచింది. చిన్నారులు ప్రదర్శించిన విచిత్ర వేషధారణ, ఏక పాత్రాభినయ పోటీలు అందరినీ అలరించాయి. భారతీయ సంప్రదాయ నృత్య రీతులైన భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి నృత్యాలను వీక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు