: యూసఫ్ గూడలో ఏపీఎస్పీ 56వ అవతరణ దినోత్సవం
హైదరాబాద్ యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ లో ఇవాళ ఏపీఎస్పీ 56వ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. యూసఫ్ గూడ బెటాలియన్ గ్రౌండ్ వేదికగా ప్రత్యేక కవాతు నిర్వహించగా ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ అడిషనల్ డీజీపీ కౌముది, ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీలు యోగానంద్, అజయ్ కుమార్, బెటాలియన్ కమాండెంట్ శ్రీరామమూర్తి, అడిషనల్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.