: మనిషిని చూసి కుక్క తోక ఊపడం.. ఈనాటిది కాదు.. !
భూమండలం మీద మానవుడికి మచ్చికైన అన్ని జంతువుల్లో కెల్లా కుక్కదే ప్రథమస్థానం. అది చూపే విశ్వాసం అలాంటిది. అందుకే అప్పుడప్పుడు మనం తోటివారిని సందర్భోచితంగా శునకాలతో పోల్చుతుంటాం. 'కొంచెమైనా విశ్వాసం ఉండాలి' అంటూ కుక్కనోసారి గుర్తు చేసుకుంటాం.
అయితే, శాస్త్రవేత్తలు ఊరకుండరు కదా! కుక్క విశిష్ట గుణమైన విశ్వాసం ఎన్నేళ్లనాటిదో అని లెక్కగట్టారు. దక్షిణ సైబీరియా ప్రాంతంలో దొరికిన ఓ కుక్క పంటి శిలాజాన్ని తీసుకుని దానిపై పరిశోధనలు చేశారు. ఏదైతేనేం, ఫలితం సాధించారు.
33 వేల ఏళ్ల నాటి క్రితమే కుక్క మనిషిని చూసి తోక ఊపిందని నిర్దారణకొచ్చారు. పైగా తాము పొరబడి తోడేలు శిలాజాన్ని పరిశోధించామేమోనని దానికి డీఎన్ఏ టెస్టులూ గట్రా చేసి, ఇది కుక్కే అని ముక్తాయించారు. అదండీ మనిషి.. కుక్క.. విశ్వాసం కథ!.