: కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నటుడు పాల్ వాకర్
ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ కారు ప్రమాదంలో మరణించినట్లు ఆయన తరఫు ప్రచారకర్త ఇడెన్ ప్రకటించారు. లాస్ ఏంజెలిస్ లో శనివారం జరిగిన వాహన ప్రమాదంలో పాల్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారని, ప్రమాద ఘటనలో కారు నుజ్జునుజ్జు అయిందని, కారు నడుపుతున్న వ్యక్తి పాల్ వాకర్ గా గుర్తించినట్లు ఇడెన్ చెప్పారు. ’ఫాస్ట్ అండ్ ప్యూరియన్‘ సిరీస్ చిత్రాలతో పాల్ వాకర్ (40 సంవత్సరాలు)కు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పాల్ నటించిన ’అవర్స్‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.