: హత్యకేసు నిందితులు, సంఘ విద్రోహితో లాకప్ లో తేజ్ పాల్
అత్యాచారం ఆరోపణలపై శనివారం అరెస్టైన తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ పనాజీలోని లాకప్ లో ఇద్దరు హత్యకేసు నిందితులు, ఓ సంఘ విద్రోహి మధ్య గడిపారు. అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఆయనకు గోవా మెడికల్ కాలేజీ వైద్య శాలలో వైద్యపరీక్షలు నిర్వహించారు. 2 గంటలకు ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి లాకప్ కు తరలించారు. డీజీపీ కార్యాలయం ఎదురుగా గల ఈ పోలీసు లాకప్ బయట క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది కాపలా ఉన్నారు. ఆయన అసుపత్రి నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. లాకప్ లో రాత్రంతా ఆయన ప్రశాంతంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.