: నౌకాదళ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
విశాఖ తీరంలో డిసెంబర్ 4వ తేదీన జరిగే ’నేవీ డే‘కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం నౌకాదళ దినోత్సవాన్ని తూర్పు నౌకాదళం నిర్వహిస్తోంది. భారత్-పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత నౌకాదళానికి చెందిన మిస్సైల్ బోట్లు కరాచీ రేవుపై దాడి చేసి చావుదెబ్బ తీశాయి. ఆ ఘటనకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన యుద్ధవీరులకు నివాళి అర్పించి, నావికా దళ శక్తి సామర్థ్యాలను తీరంలో ప్రదర్శిస్తారు. బుధవారం విశాఖ ఆర్.కె.బీచ్ లో ఈ కార్యక్రమం జరగనుంది.