: 840 రూపాయల చోరీ.. 37 ఏళ్ల తర్వాత అరెస్ట్
విధి ఒక నిందితుడిని 37 ఏళ్ల తర్వాత పట్టిచ్చింది. త్రిపురకు చెందిన 57ఏళ్ల అభినాష్ దాస్ ను అగర్తలలోని నారాయణ్ పూర్ లో ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు 37 ఏళ్ల క్రితం 840 రూపాయలను దొంగిలించాడని, అప్పటి నుంచీ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అభినాష్ ను కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు.