: ఆ ప్రాజెక్టులన్నీ ఓటికుండలే: పయ్యావుల
మిగులు జలాలపై కడుతున్న 11 ప్రాజెక్టులు ఓటికుండలేనని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ మిగులు జలాలపై వైఎస్ ఇచ్చిన లేఖ ఇవాళ రాష్ట్రానికి మరణ శాసనమైందన్నారు. వైఎస్ జల యజ్ఞం ఎందుకు ప్రారంభించారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. నీటి పారుదల గురించి తెలియని న్యాయవాదితో ట్రైబ్యునల్ లో వాదనలు వినిపించారని ఆయన విమర్శించారు. ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయ, నీటిపారుదల నిపుణులతో కమిటీ వేయాలని, దాని సూచనల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ వాదాన్ని తెరమీదికి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.