: కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు అనారోగ్యం.. అపోలో ఆస్పత్రిలో చికిత్స


కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం నడకకు వెళ్లి వచ్చిన తరువాత ఆయనకు రక్తపోటు, చక్కెర స్థాయిలు పెరిగిపోయాయి. తలనొప్పి, వాంతులతో బాధపడుతున్న బ్రహ్మయ్యను కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ చేశామని, కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News