: మహేష్ బ్యాంక్ చోరీ కేసు... కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని మహేష్ కో అపరేటివ్ బ్యాంక్ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. చోరికి పాల్పడిన ఓ దొంగ ఆనవాళ్లు సీసీ కెమెరాలో దొరికాయి. సీసీ కెమెరా వైర్లు కత్తిరించే ముందు ఆగంతుకుడు కెమెరాలో చిక్కాడు. కెమెరా ఫుటేజిని పోలీసులు నిశితంగా పరిశీలించారు. రెండు తాళాలు ఉపయోగించి లాకర్లు తెరచి ఆగంతుకులు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని, బ్యాంకు గురించి బాగా తెలిసిన వారే ఇది చేసి ఉంటారని పోలీసులు నిర్థారించారు.