: జైలు నుంచి 40 మంది ఖైదీల పరారీ
లిబియాలోని సభ నగరంలోని జైలు నుంచి 40 మంది ఖైదీలు పరారయ్యారని జైలు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆగంతుకులు జైలుపై విచక్షణా రహిత కాల్పులతో దాడికి పాల్పడి ఖైదీలను విడిపించుకుపోయారని జైలు అధికారి నాసర్ సబ్బాన్ తెలిపారు. భద్రతా సిబ్బంది తేరుకునే లోపే ఆగంతుకులు దాడికి పాల్పడడం, ఖైదీలను విడిపించుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయని చెప్పారు. ఖైదీలను పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.