: భూ కక్ష్య దాటేసిన మామ్
అంగారకుడిపై రహస్యాల అన్వేషణకు ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఎట్టకేలకు భూ కక్ష్యను దాటింది. నవంబర్ 5న దీన్ని ఇస్రో శ్రీహరి కోటనుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. గత అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు మామ్ ను విజయవంతంగా భూ కక్ష్య దాటించారు. దీంతో మామ్ అంగారకుడి దిశగా పయనం మొదలెట్టింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో అరుణుడిని చేరుతుంది.