: భారత్ లో ఇలా కుదరదు.. ఇక్కడే ఉంటాను


పురుషుడిలా బ్రిటన్ లో జీవించేందుకు ఓ భారతీయ మహిళ ఇష్టపడుతోంది. బ్రిటన్ లో ఆమె మాట్లాడుతూ తాను అలా ఉండడాన్ని భారతీయ సమాజం సహించలేకపోతోందని, తనను చిన్న చూపు చూస్తోందని, తనను భారత్ కు తిరిగి పంపేస్తే వేధింపులు తప్పకపోగా, ప్రాణానికే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో సమీర్ నీలం అనే హైదరాబాదీ మహిళ మరో మహిళతో కొంత కాలం పురుషుడిలా సహజీవనం సాగించింది.

దీన్ని భారతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో తాను హింసకు, వేధింపులకు గురయ్యానని సమీర్ తెలిపింది. భారత్ లో నచ్చిన వస్త్రాలు ధరించలేనని, వివక్షకు గురౌతానని, సమాజం నుంచి బహిష్కరిస్తారని బీబీసీ న్యూస్ కు తెలిపింది. తనను ఎవరైనా మిస్టర్ లేదా అతడు అని సంబోధిస్తే అమితానందం కలుగుతుందని తెలిపింది.

బ్రిటిష్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లింగ నిర్థారణ ఆధారంగా వేధింపులకు గురవుతాననే భయం ఉంటే ఆ దేశాన్ని ఆశ్రయం కోరవచ్చు. దీనిపై బ్రిటన్ హోం శాఖాధికారి మాట్లాడుతూ ఆశ్రయం కల్పించమని తమను ఎవరు కోరినా వారి దరఖాస్తును పరిశీలిస్తామని అర్హత ఉంటే కల్పిస్తామని తెలిపారు. దీని ప్రకారం రానున్న వారాల్లో సమీర్ నీలంకు ఆశ్రయం లభించే అవకాశం ఉంది. హోం శాఖ తిరస్కరిస్తే మాత్రం ఆమె భారత్ కు రాకతప్పదు.

  • Loading...

More Telugu News