: 4 లక్షల అప్పు తీర్చలేదని 5 నెలలుగా మహిళ నిర్బంధం
తిరుపతిలో ఓ వ్యాపారి అనుచిత చర్యకు పాల్పడ్డాడు. రియల్టీ వ్యాపారి ప్రసాద్ దగ్గర ఒక మహిళ 4 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. అది తీర్చలేదన్న కోపంతో ప్రసాద్ ఆమెను ఐదు నెలల క్రితం ఇంటిలో బంధించాడు. తనను విడిచిపెట్టాలని కోరినా అతడి మనసు కరగలేదు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో ఆమెకు విముక్తి లభించింది. పోలీసులు వ్యాపారిని అరెస్ట్ చేశారు.