: డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తున్నారా..? పిన్ తప్పనిసరి
మీరు డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తారా? అయితే మీ పిన్ నంబర్ ను తప్పనిసరిగా గుర్తుంచుకుని మరీ వెళ్లండి. ఎందుకంటే నేటి నుంచి డెబిట్ కార్డు ద్వారా జరిగే బిల్లు చెల్లింపులకు ముందు పిన్ నంబర్ ను ప్రవేశపెట్టడాన్ని రిజర్వ్ బ్యాంకు తప్పనిసరి చేసింది. డెబిట్ కార్డుతో కొనుగోళ్లను మరింత సురక్షితంగా మార్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కార్డును స్వైప్ చేశాక వినియోగదారుడు తన కార్డుకు సంబంధించి రహస్య నాలుగు అంకెల పిన్ నంబర్ ఎంటర్ చేస్తేనే ఆ లావాదేవీ పూర్తవుతుంది. కార్డు పోయినా వేరొకరు దాన్ని దుర్వినియోగం చేయడానికి ఇకపై కుదరదు. అలాగే, స్వైప్ చేస్తున్న సమయంలో కార్డుపై ఉన్న 16 అంకెల నంబర్ ను రహస్య కెమేరాలో స్కాన్ చేసి, నకిలీ కార్డును తయారు చేసి వినియోగించే నేరాలకు చెక్ పడుతుందని రిజర్వ్ బ్యాంకు ఆలోచన.