: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 199 స్థానాలకు జరుగుతున్న ఈ పోలింగ్ లో 4 కోట్ల 8 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికిగాను 47,223 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీఎస్పీ అభ్యర్థి మృతితో చురు నియోజకవర్గ పోలింగ్ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.