: ప్రజల్లో అవగాహన పెరుగుతోందట
ప్రజల్లో ఒకప్పుడు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎయిడ్స్ వ్యాధికి గురయ్యేవారు. కానీ క్రమేపీ ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన పెరుగుతోంది. దీని వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 1988లో ప్రపంచ ఎయిడ్స్ డేను ప్రారంభించారు. ఇక అప్పటినుండీ ఎయిడ్స్ వ్యాధి గురించి, దాని నియంత్రణ గురించి ప్రచార కార్యక్రమాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది. ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఈ సంస్థ నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కూడా పెరిగింది. దీనికితోడు నాణ్యమైన మందులు అందుబాటులోకి రావడం వల్ల ఈ వ్యాధి బారిన పడినవారి జీవితకాలం కూడా గణనీయంగా పెరిగింది. అయినా కూడా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ కృషిచేస్తోంది. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా అన్ని దేశాలు విస్తృత ప్రచారం చేపట్టాలనే ఉద్దేశంతో ప్రతిఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుండి 'గెటింగ్ టు జీరో' (కొత్త కేసుల సంఖ్య అసలు ఉండకూడదు) అనే నినాదంతో ఈ సంస్థ ముందుకెళుతోంది. ఇదే నినాదంతో 2015 వరకూ కృషి చేస్తారు. ఎయిడ్స్ మరణాలను పూర్తిగా అరికట్టే విధంగా కృషి చేయాలని అన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది.