: కూలిపోయిన అదృశ్యమైన విమానం: 34 మంది మృతి
మొజాంబిక్ నుంచి అంగోలా వెళుతూ నిన్న సాయంత్రం (శుక్రవారం) అదృశ్యమైన ఎయిర్ లైన్స్ విమానం నంబియాలో కూలినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 34 మంది మరణించినట్లు నంబియా పోలీసులు ఈ రోజు ధ్రువీకరించారు. మరణించిన వారిలో 28 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు వివరించారు.