: ఓటరు జాబితాలో పేర్లు దరఖాస్తు చేసుకోండి: భన్వర్ లాల్


ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నవారు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. హైదరాబాదు శివారు శామీర్ పేట బిట్స్ పిలానీలో 'లెట్స్ ఓట్' సంస్థ చేపట్టిన ఓటుహక్కు నమోదు, ఈ-రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమంలో నమోదు, రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమంలో భన్వర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు నమోదు కోసం మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 2014 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారంతా నమోదు చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News