: అరకు అందాలను చూసి పరవశించిపోయిన పర్యాటకులు
విశాఖ జిల్లాలోని పర్యాటక కేంద్రం అరకు లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది. వారాంతం కావడంతో విద్యార్థులు, విదేశీయులు విహార యాత్రకు వచ్చారు. అరకులో ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు. ఇక్కడకు వచ్చిన వారు యాత్ర మధురానుభూతులను గుర్తుంచుకొనేందుకు మ్యూజియమ్, పద్మావతి పార్క్ వద్ద ఫోటోలు దిగారు.
ఇదిలావుంచితే, ఇక్కడ అరకు ఉత్సవాలు మూడో రోజు కూడా సందడిగా కొనసాగుతున్నాయి. గిరిజనుల ఆటపాటలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అడవిలో దొరికే అరుదైన మొక్కలతో పాటు తాము రూపొందించిన వస్తువులను గిరిజనులు ప్రదర్శనలో ఉంచారు.