: సిరియా అంతర్యుద్ధంలో భారత జిహాదీలు..!
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న పోరాటంలో భారత జిహాదీలు కూడా పాల్గొంటున్నారని అధ్యక్షుడు అస్సాద్ రాజకీయ సలహాదారు బౌతాయిని షాబాన్ వెల్లడించారు. భారత తీవ్రవాదులు తిరుగుబాటు దళాలతో కలిసి పోరాడుతున్నట్టు షాబాన్ పేర్కొన్నారు.
అందువల్లే భారత్ ను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోమంటున్నామన్నారు. భారత జిహాదీలు బ్రిటన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు. వీరి సంఖ్య 38 వరకు ఉంటుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం షాబాన్ భారత్ లో ఉన్నారు. అస్సాద్ దూతగా ప్రధాని మన్మోహన్ కు సందేశం తీసుకువచ్చారు.