: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
డిసెంబర్ ఒకటవ తేదీన జరుగనున్న రాజస్థాన్ అసెంబ్లీ పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఆదివారం 199 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బీఎస్పీ అభ్యర్థి మృతితో చురు నియోజకవర్గ పోలింగ్ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా పడింది. ఎన్నికల సామగ్రిని ఈసీ ఆయా నియోజకవర్గాలకు తరలించింది. పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది ఇప్పటికే పోలింగ్ జరిగే ప్రాంతాలకు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ ‘నోటా’ బటన్ ను ఏర్పాటు చేసింది.