: రాయల తెలంగాణకు నేను వ్యతిరేకం: మంత్రి టీజీ
రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. తాను సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంతం కాదని, ఆరంభం మాత్రమేనని అన్నారు. ఒకసారి విభజన జరిగితే, చాలా విభజనలు చేయాల్సి వస్తుందని తెలిపారు.