: గ్లాస్గో సిటీలో హెలికాప్టర్ కూలి 32 మందికి తీవ్ర గాయాలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గో సిటీ పబ్ పై నిన్న రాత్రి (శుక్రవారం) ఓ పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దారుణ ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, ఈ సంఖ్య ఆరుకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.