: ముంబై ఆసుపత్రిలో కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ
గుండెపోటు కారణంగా ఆసుపత్రి పాలైన క్రికెటర్ వినోద్ కాంబ్లీ కోలుకుంటున్నట్లు ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాంబ్లీ ఐసీయూలో ఉన్నారని, ప్రతి నిమిషం తాము పర్యవేక్షిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ నరేంద్ర త్రివేది చెప్పారు. పరిస్థితి స్థిరంగా ఉందని, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నిన్న కారులో చెంబూర్ నుంచి బాంద్రా వెళుతుండగా కాంబ్లీ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అక్కడి మహిళా ట్రాఫిక్ పోలీసు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.